రూ.లక్ష తిరిగిచ్చేసిన మహిళా సంఘం

13-10-2015 Tue 15:20

బ్యాంకు క్యాషియర్ పొరపాటు పడి ఒక లక్ష రూపాయలు ఎక్కువివ్వగా.. ఆ డబ్బును తిరిగి ఇచ్చివేసి తమ నిజాయతీ చాటుకున్నారు ఒక మహిళా సంఘం సభ్యులు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పట్టణంలోని సుభాష్ నగర్ కు చెందిన సాయి స్లమ్ సమాఖ్యలోని శ్రీ సాయి మహళా సంఘం సభ్యులు నిన్న సిరిసిల్ల ఆంధ్రాబ్యాంకు నుంచి రూ.4 లక్షలు రుణం తీసుకున్నారు. క్యాషియర్ పొరపాటుపడటంతో ఒక లక్ష రూపాయలు ఎక్కువగా వచ్చారు. ఆ డబ్బు తీసుకుని వెళ్లిన సభ్యులు లెక్కించగా ఒక లక్ష రూపాయలు ఎక్కువ వచ్చింది. వెంటనే బ్యాంక్ కు వచ్చి ఆ లక్ష రూపాయలు తిరిగి ఇచ్చివేసి తమ నిజాయతీ నిరూపించుకున్నారు. ఈ సందర్భంగా మహిళా సంఘం రిసోర్స్ పర్సన్ గాజుల వీణ, బూర్ల రేవతిని బ్యాంకు అధికారులు అభినందించారు.