: భవిష్యత్ కార్యాచరణపై వైకాపా ముఖ్య నేతల సమావేశం

ప్రత్యేక హోదా కోసం జగన్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ముగిసింది. ఈ ఉదయం జగన్ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ నేపథ్యంలో, ఉద్యమ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు వైకాపా ముఖ్య నేతలు గుంటూరులో సమావేశమయ్యారు. ఎంపీలు మేకపాటి, వైవీ సుబ్బారెడ్డి ఇతర నేతలు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, పార్థసారథి, కొడాలి నాని తదితరులు భేటీలో పాల్గొన్నారు. గుంటూరులో అందుబాటులో ఉన్న ఇతర నాయకులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా, జగన్ ను అరెస్ట్ చేయడంపై నిరసన వ్యక్తం చేయాలని నేతలు నిర్ణయించారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమాన్ని మరింత ఉధ్ధృతం చేయాలని నిర్ణయించి, దానికి అనువుగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. అమరావతి శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చిన సందర్భంలోనే... ప్రత్యేక హోదాపై ప్రకటన చేసేలా ఒత్తిడి తెచ్చేందుకు ఎలా ఉద్యమించాలి అన్నదానిపై చర్చిస్తున్నారు.

More Telugu News