జగన్ ఆరోగ్య పరిస్థితి ఏంటంటే... హెల్త్ బులెటిన్ వివరాలివి!

13-10-2015 Tue 14:24

ఈ తెల్లవారుజామున పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించిన వైకాపా అధినేత వైఎస్ జగన్ ఆరోగ్యంపై గుంటూరు జీజీహెచ్ వైద్యలు ప్రత్యేక హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయనకు ప్లూయిడ్స్ అందిస్తున్నామని, మరో 24 గంటల పాటు తమ డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉండాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ రాజునాయుడు వెల్లడించారు. జగన్ ఆరోగ్యం కుదుటపడుతోందని, ఆయనకు బ్లడ్ ప్రెజర్ 130/80, కీటోన్స్ 3 ప్లస్, యూరిక్ యాసిడ్ 13.2 గా ఉందని వివరించారు. ప్రస్తుతానికి ఐసీయూలోనే ఉంచి చికిత్స చేస్తున్నామని, పూర్తిగా కోలుకునేదాకా ఆసుపత్రిలో ఉండాలని సలహా ఇచ్చామని తెలిపారు. జగన్ కిడ్నీల పనితీరు బాగుందని రాజునాయుడు తెలియజేశారు.