దైకిన్ లో దండేపల్లి యువకుడికి భారీ ప్యాకేజీ

13-10-2015 Tue 13:50

ప్రముఖ హార్డ్ వేర్ ఉత్పత్తుల కంపెనీ దైకిన్ లో దండేపల్లి యువకుడు భారీ ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించాడు. ఢిల్లీ ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి పంచాయతీ పరిధిలోని కర్ణపేటకు చెందిన అజ్మేరా సంకేత్ కుమార్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. దైకిన్ కంపెనీ ఢిల్లీ ఐఐటీలో ఈ మధ్య నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలకు 20 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో సంకేత్ కుమార్ ఒక్కడే సఫలీకృతుడయ్యారు. ఏడాదికి 30 లక్షల రూపాయల వేతనంతో ఆయనకు దైకిన్ కంపెనీ అవకాశం ఇచ్చింది. వచ్చే ఏడాది మే, జూన్ నెలల్లో శిక్షణ అనంతరం ఆయన విధుల్లో చేరనున్నారు.