కులకర్ణిపై దాడి ఘటనను ఖండించిన జమ్ముకశ్మీర్ సీఎం

13-10-2015 Tue 13:02

ముంబైలో రచయిత సుధీంద్ర కులకర్ణిపై నలుపు రంగు ఇంకుతో శివసేన కార్యకర్తలు దాడి చేయడాన్ని జమ్ముకశ్మీర్ సీఎం ముఫ్తిమహ్మద్ సయీద్ ఖండించారు. ఇటువంటి చర్యలు దేశానికి మాయనిమచ్చగా మిగిలిపోతాయని అన్నారు. ద్వేష రాజకీయాలకు భారత్ వంటి దేశంలో స్థానం లేదని చెప్పారు. కులకర్ణిపై దాడి దురదృష్టకరమని ముఫ్తీ పేర్కొన్నారు.