మాల్ సిబ్బందిపై పూజా మిశ్రా దాడి... మీరూ చూడండి!

13-10-2015 Tue 12:44

తనపై సోనాక్షీ సిన్హా లైంగిక దాడి చేయిచ్చిందని ఒకసారి, ఆపై ఢిల్లీలోని ద్వారకా హోటల్ లో వస్తువులు పగులగొట్టి, దానికి డబ్బడిగిన సిబ్బందిని ఇష్టమొచ్చినట్టు తిడుతూ, కొడుతూ మరోసారి వార్తల్లో నిలిచిన బాలీవుడ్ నటి, మోడల్, బిగ్ బాస్ పోటీదారు పూజా మిశ్రా మరో వివాదంలో చిక్కుకుంది. ఈ దఫా ఓ మాల్ లోకి పొట్టి దుస్తులతో వెళ్లి, అక్కడి కస్టమర్లను దుర్భాషలాడుతూ, ఎగిరెగిరి తన్నింది. ఈ ఘటన కరోల్ బాగ్ లోని ఓ మాల్ లో జరుగగా, ఓ వ్యక్తి దీన్ని తన మొబైల్ లో చిత్రీకరించాడు. కస్టమర్లు కొందరు తనతో అసభ్యంగా ప్రవర్తించారని పూజా ఆరోపిస్తుండగా, ఆమె తమను తప్పుగా అర్థం చేసుకుందని ఓ వ్యక్తి చెబుతుండటం, ఆపై మాటలు పెరిగి అతన్ని తన్నడం ఈ వీడియోలో ఉంది. ఇప్పుడా వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. మీరూ చూడండి.