హన్మకొండలో టీడీపీ నేతను తుపాకితో బెదిరించిన కాంగ్రెస్ నేత!

13-10-2015 Tue 12:26

వరంగల్ జిల్లా హన్మకొండలో భూవివాదం విషయంపై కాంగ్రెస్, టీడీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. డీసీసీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, టీడీపీ అర్బన్ అధ్యక్షుడు మురళి మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో రాజేందర్ రెడ్డి తుపాకీ తీసి టీడీపీ నేత మురళిని బెదిరించారు. ఈ చర్యతో అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఖిన్నులయ్యారు. వెంటనే రాజేందర్ ను అడ్డుకుని తుపాకీని లోపల పెట్టుకోమని చెప్పారు. ఆ సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టు సమాచారం.