జీహెచ్ఎంసీ పరిధిలో ఓట్ల తొలగింపుపై ఈసీకి టీటీడీపీ ఫిర్యాదు

13-10-2015 Tue 11:55

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఓట్ల తొలగింపుపై తెలంగాణ టీడీపీ మరోసారి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మొత్తం ఆరు లక్షల ఓట్లను తొలగించారని, వారి వివరాలను ఈసీకి అందజేశామని ఆ పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ మీడియాకు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో అర్హులందరికీ ఓటుహక్కు కల్పించాలని, లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. దానిపై మూడు రోజుల్లోగా ఈసీ స్పందించాలని డిమాండ్ చేశారు. అయితే ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా భన్వర్ లాల్ పట్టించుకోవడంలేదని నిరాశ వ్యక్తం చేశారు. త్వరలో ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.