: 'ప్లే బాయ్' ఇక అలా ఉండదు!

ప్లేబాయ్ మేగజైన్... ఈ పేరు వినగానే గుర్తొచ్చేది ఒకటే. హాలీవుడ్ సెలబ్రిటీల నుంచి వివిధ దేశాల్లోని సుందరీమణుల నగ్న చిత్రాలను ప్రచురిస్తుందని. 1953లో తొలిసారిగా మార్లిన్ మన్రో నగ్న చిత్రంతో మార్కెట్లోకి వచ్చి సంచలనం సృష్టించిన ఈ పత్రిక ఇకపై పూర్తి నగ్న చిత్రాలను ప్రచురించరాదన్న నిర్ణయానికి వచ్చింది. నగ్న చిత్రాల కోసం ప్లేబాయ్ పత్రికను ప్రజలు ఆశ్రయించడం నానాటికీ తగ్గుతుండటమే ఇందుకు కారణం. విస్తరించిన ఇంటర్నెట్, ప్రసార మాధ్యమాలు ప్లేబాయ్ సర్క్యులేషన్ ను గణనీయంగా తగ్గించి వేశాయి. 1975లో 56 లక్షలుగా ఉన్న పత్రిక సర్క్యులేషన్, ఇప్పుడు 8 లక్షలకు పరిమితమైంది. దీంతో పత్రికను రీడిజైన్ చేయాలని ఎడిటర్-ఇన్-చీఫ్ హెఫ్నర్ (89)తో జరిగిన చర్చల్లో పత్రిక సంపాదకవర్గం సమావేశమై నిర్ణయం తీసుకుంది. ఇకపై నగ్న చిత్రాలకు దూరంగా ఉండాలని, వాటి స్థానంలో పత్రికా పఠనాన్ని పెంచి, కస్టమర్ల మనసుకు దగ్గరయ్యేలా కథనాలు రాయాలని వారు నిర్ణయించారు. కాగా, ప్లేబాయ్ చరిత్రలో నవంబర్ 1972 నాటి సంచిక దాదాపు 70 లక్షల కాపీలు అమ్ముడై రికార్డు సృష్టించింది. ఆ సంచికలో మడోనా, షరాన్ స్టోన్, నవోమీ క్యాంప్ బెల్ వంటి హాలీవుడ్ అందగత్తెల నగ్న చిత్రాలను పత్రిక ప్రచురించింది.

More Telugu News