నవరాత్రులు షురూ... ఏ రోజు ఏ రంగు బట్టలు ధరించాలంటే...!

13-10-2015 Tue 10:50

శరన్నవరాత్రులు మొదలయ్యాయి. తమను చల్లగా చూడాలని, చేపట్టిన పనుల్లో విజయం అందించాలని అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మను భక్తి శ్రద్ధలతో పూజించే రోజులివి. ఈ నేపథ్యంలో నవరాత్రుల సందర్భంగా ఏరోజు ఏరంగు దుస్తులు ధరిస్తే, పార్వతీదేవి కరుణాకటాక్షాలు మరింత సులువుగా లభిస్తాయో తెలుసుకుందాం. అక్టోబర్ 13, మంగళవారం - ఘటస్థాపన - ఎరుపు (రెడ్) రంగు దుస్తులు అక్టోబర్ 14, బుధవారం - చంద్ర దర్శనం - ముదురు నీలం (రాయల్ బ్లూ) దుస్తులు అక్టోబర్ 15, గురువారం - బ్రహ్మచారిణీ పూజ - పసుపు (ఎల్లో) రంగు దుస్తులు అక్టోబర్ 16, శుక్రవారం - సింధూర తృతీయ - ఆకుపచ్చ (గ్రీన్) రంగు దుస్తులు అక్టోబర్ 17, శనివారం - కూష్మాండ పూజ - బూడిద (గ్రే) రంగు దుస్తులు అక్టోబర్ 18, ఆదివారం - స్కందమాత పూజ - నారింజ (ఆరంజ్) రంగు దుస్తులు అక్టోబర్ 19, సోమవారం - కాత్యాయనీ పూజ, సరస్వతీ పూజ - తెలుపు (వైట్) రంగు దుస్తులు అక్టోబర్ 20, మంగళవారం - కాళరాత్రి పూజ, గులాబీ (పింక్) రంగు దుస్తులు అక్టోబర్ 21, బుధవారం - దుర్గాష్టమి, మహాగౌరి పూజ - ఆకాశ నీలం (స్కై బ్లూ) రంగు దుస్తులు. ఈ తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రంగుల దుస్తులు ధరించి అమ్మవారిని పూజిస్తే మేలు కలుగుతుందని పండితులు చెబుతున్నారు.