ఐఐటీ విద్యార్థులకు రాజమౌళి పాఠాలు

13-10-2015 Tue 09:36

బాహుబలి సృష్టికర్త ఎస్ఎస్ రాజమౌళి ఇప్పుడు ఉపాధ్యాయుడి అవతారం ఎత్తనున్నారు. ఐఐటీ విద్యార్థులకు ఆయన పాఠాలు చెప్పనున్నారు. ఇందుకు మద్రాస్ ఐఐటీ వేదిక కానుంది. ఈ నెల 17వ తేదీన మద్రాస్ ఐఐటీలో రాజమౌళి క్లాసులు ఉంటాయని కళాశాల అధికారులు వివరించారు. ఉపన్యాసాల తరువాత సాయంత్రం అక్కడి విద్యార్థులతో సమావేశమై, వారు అడిగే ప్రశ్నలకు రాజమౌళి సమాధానాలు చెప్పనున్నారని తెలిపారు. బాహుబలి చిత్రీకరణ, గ్రాఫిక్స్, వేల మంది ఆర్టిస్టులను మేనేజ్ చేసిన తీరు తదితరాంశాలపై రాజమౌళి ప్రసంగాలు ఉంటాయని తెలుస్తోంది.