శేషాచలం అడవుల్లో తుపాకుల కాల్పులు!

13-10-2015 Tue 09:26

చిత్తూరు జిల్లా పరిధిలోని శేషాచలం అడవుల్లో మరోసారి తుపాకుల మోతలు వినిపించాయి. గత రాత్రి 8 గంటల సమయంలో అడవుల్లో కూంబింగ్ చేస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు లక్ష్యంగా ఎర్రదొంగలు రాళ్లదాడికి దిగడంతో, పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో కూలీలు అక్కడి నుంచి పరారయ్యారు. అడవుల నుంచి తరలించడానికి సిద్ధంగా ఉన్న కోటిన్నర రూపాయల విలువైన దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 50 మంది వరకూ కూలీలు అడవుల్లోకి వచ్చినట్టు తమకు సమాచారం అందిందని, పరారైన కూలీల కోసం గాలిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు వివరించారు.