'నాది తెలంగాణ గోత్ర'మన్న టీఆర్ఎస్ నేత

12-10-2015 Mon 21:44

‘నా గోత్రం తెలంగాణ. ప్రజలందరూ సుఖంగా ఉండాలని పూజ చేయండి పంతులుగారు’ అంటూ మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని అడ్డాకుల మండలం శాఖాపూర్ లో సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహ ఏర్పాటుకు గాను స్వామిగౌడ్ శంకుస్థాపన చేశారు. అనంతరం కందూరు రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోత్రమేమిటని పూజారి ప్రశ్నించగా పైవిధంగా ఆయన స్పందించారు. ప్రత్యేక పూజల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కల్లు గీత కార్మికుల కోసం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు.