రచయితలు ప్రతిష్టాత్మక అవార్డులు వెనక్కిచ్చేస్తున్నా ప్రధాని స్పందించరేం?: ఆప్ నేత కుమార్ విశ్వాస్

12-10-2015 Mon 20:03

ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ అవార్డులను రచయితలు వెనక్కిచ్చేస్తున్నా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించటం లేదని ఆప్ నేత కుమార్ విశ్వాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై మోదీ మౌనంగా ఉండటం భయం కల్గిస్తోందన్నారు. ఈరోజు సుధీంద్ర కులకర్ణికి జరిగిన అవమానంపై కూడా మోదీ పెదవి విప్పకపోవడం దారుణమన్నారు. అంకారా పేలుళ్లు, నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆరోగ్యం మొదలైన అంశాలపై స్పందించిన మోదీ, దీనిపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని కుమార్ విశ్వాస్ ప్రశ్నించారు.