మా అక్షర విజయాలు చూసి గర్వపడుతుంటా: శ్రుతిహాసన్

12-10-2015 Mon 18:12

‘అక్షర సాధిస్తున్న విజయాలు చూసి గర్వపడుతుంటా. చెల్లెలి సంరక్షణ విషయంలో ఎప్పుడూ జాగ్రత్త తీసుకుంటాను. అక్షర.. నా రాజకుమారి’ అంటూ చెల్లెలిపై తనకున్న ప్రేమను బయటపెట్టింది అందాల తార శ్రుతిహాసన్. ఈరోజు అక్షర హాసన్ పుట్టినరోజు సందర్భంగా అక్క శ్రుతి ట్వీట్ చేసింది. బర్త్ డే శుభాకాంక్షలు చెప్పడంతో పాటు అక్షర గురించి తన మనస్సులో ఉన్న మాటను బయటపెట్టింది. కాగా, తన పుట్టిన రోజును ఇంత ప్రత్యేకంగా ఫీలయ్యేలా చేసిన అభిమానులకు అక్షర కృతఙ్ఞతలు చెప్పింది.