ఇకపై ఏపీ సీఎం క్యాంప్ ఆఫీన్ నుంచి ఎయిర్ పోర్టుకు హెలికాప్టర్ లోనే

12-10-2015 Mon 16:11

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి గన్నవరం విమానాశ్రయానికి ఇకపై హెలికాప్టర్ లోనే వెళ్లాలని నిర్ణయించారు. సాధారణంగా, క్యాంప్ ఆఫీస్ నుంచి ఎయిర్ పోర్ట్ కు చంద్రబాబు వెళ్లే సమయంలో విజయవాడ సిటీ, హైవేలో ట్రాఫిక్ ను నిలిపివేస్తారు. దీంతో ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతోంది. ఈ కారణంగానే చంద్రబాబు ఈ నిర్ణయానికి వచ్చారు. మరోవైపు 'మన మట్టి-మన నీరు' కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు రేపు నారావారిపల్లెకు వెళుతున్నారు. మన మట్టి-మన నీరు-మన అమరావతి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులంతా పాల్గొనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.