మరో కొత్త ఫోన్ 'ఎంజాయ్ 5' విడుదల

12-10-2015 Mon 15:16

మరో కొత్త ఫోన్ ఎంజాయ్ 5ను హువాయ్ సంస్థ విడుదల చేసింది. చైనాలో మాత్రమే అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ అమ్మకాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీని ధర 999 చైనా యువాన్ లు. అయితే, భారత్ లో ఎంజాయ్ 5 ఫోన్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని సంస్థ అధికారులు ఇంకా ప్రకటించలేదు. మన కరెన్సీలో ఈ ఫోన్ ధర రూ.10,250. ఎంజాయ్ 5 ఫీచర్లు 5 అంగుళాల టచ్ స్ర్కీన్,720X1280 పిక్సల్స్ రిజల్యూషన్,13 మెగా పిక్సల్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,2జీబీ ర్యామ్,16జీబీ ఇంటర్నల్ మెమొరీ, ఎస్డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు మెమెురినీ పెంచుకునే సదుపాయం,1.3 గిగా హెడ్జ్ క్వార్డ్ కోర్ మీడియా టెక్ ప్రాసెసర్ 4జీ సపోర్ట్,ఆండ్రాయిడ్ 5.1 ఆపరేటింగ్ సిస్టంతో పాటు డ్యూయల్ సిమ్