ప్రభుత్వంలో ఉన్నవాడు పని చేయాల...ప్రతిపక్షం మాట్లాడాల: వెంకయ్యనాయుడు

12-10-2015 Mon 14:26

ప్రభుత్వంలో ఉన్న వాడు పనిచేయాల...ప్రతిపక్షంలో ఉన్నవాడు మాట్లాడాల... అన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. ఫిల్మ్ నగర్ కల్చరల్ సొసైటీకి శంకుస్థాపన సందర్భంగా విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, ప్రత్యేకహోదాపై మాట్లాడడం లేదని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని, ప్రతిరోజూ మాట్లాడడమే పనా? అని ప్రశ్నించారు. మాటకంటే చేతలు ముఖ్యమని, తాము పని చేస్తున్నామని, మాట్లాడడం లేదని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ను అన్ని రకాలుగా ఆదుకునేందుకు కేంద్రం చిత్తశుద్ధితో ఉందని ఆయన చెప్పారు. విశాఖకు మెట్రోరైలు ఇచ్చామని ఆయన తెలిపారు. పోలవరం పూర్తి చేసేందుకు కేంద్రం చిత్తశుద్ధితో పని చేస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కేంద్రం ఆదుకుంటుందని ఆయన చెప్పారు.