అగ్రిగోల్డ్ ఆస్తులు కొన్నట్టు నిరూపించండి: ప్రత్తిపాటి సవాల్

12-10-2015 Mon 13:01

అగ్రిగోల్డ్ ఆస్తులను కారుచౌకగా కొన్నానని వైకాపా నేతలు తనపై చేసిన ఆరోపణలను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఖండించారు. తన పేరు మీద కానీ, తన భార్య పేరు మీద కానీ ఎకరం పొలం కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కొనుగోలు చేసినట్టు వైకాపా నేతలు నిరూపించాలని సవాల్ విసిరారు. అవినీతికి పాల్పడటం, అక్రమాస్తులు సంపాదించడం వైకాపా నేతలకే అలవాటని విమర్శించారు. తాను అక్రమాస్తులు కొన్నట్టు వైకాపా నేతల వద్ద ఆధారాలుంటే, బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తనపై బురద చల్లడానికే ఇలాంటి కుట్రలకు వైకాపా పాల్పడుతోందని విమర్శించారు.