చిత్తూరు టాస్క్ ఫోర్స్ పోలీసుల వలలో మరో స్మగ్లర్

12-10-2015 Mon 10:38

టాస్క్ ఫోర్స్ పోలీసులకు మరో ఎర్రచందనం స్మగ్లర్ చిక్కాడు. సంవత్సరకాలంగా పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న అతన్ని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ సీఐ నేతృత్వంలో బెంగళూరులోని అల్తాఫ్ ఫాంహస్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో అక్కడే ఉన్న అతడిని అదుపులోకి తీసుకున్నారు. రూ.2 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అల్తాఫ్ ను చిత్తూరుకు తరలిస్తున్నారు.