: ఆరో రోజుకు చేరిన జగన్ దీక్ష... ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై విమర్శలు

ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష నేటికి ఆరో రోజుకు చేరింది. ఐదు రోజులుగా ఆహారం లేకపోవడంతో ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. కాగా, ఆయన ఆరోగ్యంపై వివాదం రేగుతోంది. ఆహారం తీసుకోకపోయినా ఆయన షుగర్ లెవల్స్ పడకపోవడానికి కారణమేంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తుండడంపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. ఆయన ఇప్పటికే రెండు కిలోల బరువు తగ్గినట్టు ప్రకటించారు. కాగా, జగన్ ను ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు పరామర్శిస్తున్నారు. ఐదు రోజులుగా జగన్ దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.

More Telugu News