జల్సాల కోసం దొంగతనాలు...ఇద్దరు మిత్రుల అరెస్టు

11-10-2015 Sun 21:00

కష్టపడకుండా డబ్బు సంపాదించాలనే ఆశతో మౌలాలికి చెందిన స్నేహితులు హబిబ్, మాజిద్ తప్పుదోవ పట్టారు. తాళం వేసిన ఇళ్లను ఎంచుకుని దొంగతనాలకు పాల్పడుతుంటారు. పోలీసులు వాహన తనిఖీలు చేపడుతుండగా వీళ్లద్దరిపై అనుమానం రావడంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వీళ్లద్దరూ కలిసి చేసిన దొంగతనాల విషయం బయటపడింది. నిందితుల నుంచి మూడు తులాల బంగారం, ఒక కిలో వెండి, 24 వంట గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ లోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు మిత్రులిద్దరూ పాల్పడుతుంటారని, జల్సాల కోసం ఇటువంటి తప్పుడు పనులు చేస్తున్నారని పోలీసులు చెప్పారు. నిందితులకు రిమాండ్ విధించినట్లు తెలిపారు.