మావోయిస్టు నేత శివారెడ్డి అరెస్టు

11-10-2015 Sun 20:45

ఖమ్మం జిల్లా మావోయిస్టు కార్యదర్శిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మం-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టు కిరణ్ అలియాస్ శివారెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కేకేడబ్ల్యూ కార్యదర్శి దామోదర్ కు కొరియర్ గా శివారెడ్డి ఉన్నారు. వరంగల్ జిల్లా, తాడ్వాయి మండలంలోని నార్లాపూర్ శివారెడ్డి స్వస్థలం. కాగా, పోలీసుల అదుపులో ఉన్న ‘మావో’ నేత శివారెడ్డిని తక్షణం కోర్టులో హాజరుపరచాలని విరసం నేత వరవరరావు డిమాండ్ చేశారు.