సింగపూర్ లో ల్యాండవుతూ కుప్పకూలిన విమానం

11-10-2015 Sun 18:52

సింగపూర్ లోని చంగి ఎయిర్ పోర్టులో ఒక జెట్ విమానం రన్ వేపై ల్యాండవుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిన సంఘటన ఈరోజు చోటుచేసుకుంది. విమానం ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. అయితే, విమానంలో ప్రయాణికులెవ్వరూ లేరని సింగపూర్ ఎయిర్ లైన్స్ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. ఎయిర్ బస్ 330-300 జెట్ విమానం షాంఘై పుడాంగ్ విమానాశ్రయం నుంచి తెల్లవారుజామున సింగపూర్ చేరుకుంది. అక్కడి నుంచి హాంకాంగ్ వెళ్లాల్సి ఉంది. అయితే, సింగపూర్ లో ఈ విమానానికి తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ల్యాండింగ్ గేర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఆ సమయంలో విమానం లోపల ఒక ఇంజనీరు మాత్రమే ఉన్నాడు.