దేవేంద్రుడి రాజధాని ఈ అమరావతి: నవ్యాంధ్ర రాజధానిపై చంద్రబాబు వ్యాఖ్య

11-10-2015 Sun 11:34

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధానిపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవేంద్రుడి రాజధాని ఈ అమరావతి అని ఆయన వ్యాఖ్యానించారు. 'రన్ ఫర్ కేపిటల్' పేరిట విజయవాడలో జర్నలిస్టు సంఘాలు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా రూపుదిద్దుకోబోతున్న అమరావతిలో అవకాశాలకు ఆకాశమే హద్దు అని పేర్కొన్నారు. రాజధాని శంకుస్థాపన సందర్భంగా భారీ స్థాయిలో వేడుకలను ఆయన ప్రకటించారు. ఈ నెల 13 నుంచి 22 వరకు వేడుకలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.