‘రన్ ఫర్ కేపిటల్’ ర్యాలీలో చంద్రబాబు... జర్నలిస్టుల పిలుపునకు భారీ స్పందన

11-10-2015 Sun 10:08

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మరోమారు ర్యాలీలో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. మొన్న గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ర్యాలీలో పాల్గొన్న ఆయన విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపారు. తాజాగా ‘రన్ ఫర్ కేపిటల్’ పేరిట విజయవాడలో జర్నలిస్టు సంఘాలు చేపట్టిన ర్యాలీని కొద్దిసేపటి క్రితం చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు పాలుపంచుకున్నారు. ఈ ర్యాలీకి విజయవాడ ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. వేలాది మంది నగరవాసులు స్వచ్ఛందంగా ర్యాలీకి తరలివచ్చారు.