అన్నయ్య ప్రతి అడుగును అనుసరిస్తా!: జూనియర్ ఎన్టీఆర్

10-10-2015 Sat 21:34

తన అన్న చెప్పిన ప్రతి మాట వెనుక తానుంటానని, అయన ప్రతి అడుగును అనుసరిస్తానని జూనియర్ ఎన్టీఆర్ తెలిపాడు. 'షేర్' ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, 'నాన్నకు ప్రేమతో' సినిమా షూటింగ్ లో ఉండగా పిల్లలను చూసి వెళ్దామని వచ్చినప్పుడు, తన అన్న కష్టాల్లో ఉన్నాడని, 'కిక్ 2'కు డబ్బుల్లేక ఇబ్బంది పడుతుంటే సంతకాలు పెట్టేందుకు వచ్చానని మీడియాలో రాశారని, అలా రాసిన వాళ్లు ఎందుకు రాశారో తనకు తెలియదు కానీ, జీవితంలో ఎప్పుడూ కల్యాణ్ రామ్ చేయి కిందికి జారదని, ఆయన ఎప్పుడూ పైచేయిగానే ఉంటారని స్పష్టం చేశాడు. తమ కుటుంబం తమకు నేర్పింది ఇవ్వడమేనని, చేయి చాచడం కాదని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నాడు. అన్నయ్య ఎప్పుడూ నవ్వుతూ, ఇలాగే కల్మషం లేకుండా ఉండాలని జూనియర్ ఎన్టీఆర్ ఆకాంక్షించాడు.