: టాప్-50 సంపన్న కుటుంబాలలో 14 మనవే!

ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ ప్రకటించిన ఆసియాలో టాప్-50 అత్యంత సంపన్న కుటుంబాల్లో 14 భారత కుటుంబాలకు స్థానం లభించింది. ఈ జాబితాలో ఇండియా నుంచి అంబానీల కుటుంబం 21.5 బిలియన్ డాలర్ల (సుమారు 1.41 లక్షల కోట్లు) ఆస్తిపాస్తులతో మూడవ స్థానంలో నిలిచింది. ఆ తరువాతి స్థానాల్లో 17 బిలియన్ డాలర్ల (సుమారు 1.12 లక్షల కోట్లు) ఆస్తులతో అజీం ప్రేమ్ జీ కుటుంబం 7వ స్థానంలో, 14.9 బిలియన్ డాలర్లతో (సుమారు 98,340 కోట్లు) మిస్త్రీ కుటుంబం 10వ స్థానంలో నిలిచాయి. ఇండియా నుంచి ఈ జాబితాలో నిలిచిన ఇతర కుటుంబాల్లో గోద్రేజ్ ఫ్యామిలీ (15), అర్సెలర్ మిట్టల్ కుటుంబం (19), బిర్లాలు (22), బజాజ్ కుటుంబం (29), డాబర్ ఇండియాను నిర్వహిస్తున్న బుర్మాన్స్ ఫ్యామిలీ (30), కాడిల్లా హెల్త్ కేర్ నిర్వహిస్తున్న పటేళ్లు (33), ఐచర్ గ్రూప్ లాలాలు (40), శ్రీ సిమెంట్స్ నడుపుతున్న బంగుర్ కుటుంబం (42), జిందాల్ కుటుంబం (43), ముంజాల్ కుటుంబం (46), సిప్లా సంస్థ నిర్వహిస్తున్న హమైదీ ఫ్యామిలీ (50)లు ఉన్నాయి. టాప్-50లో శాంసంగ్ గ్రూప్ ను నిర్వహిస్తున్న లీ కుటుంబం మొదటి స్థానంలో నిలిచింది.

More Telugu News