: ఏ రకమైన కేన్సర్ అయినా సరే కాఫీతో దూరం!

మీకు కాఫీ తాగే అలవాటుందా? ఉండేవుంటుంది! రోజుకు ఎన్ని కప్పులు తాగుతారు? రెండో, మూడో తాగుతాం అంటారా? రోజుకు నాలుగు కప్పుల కన్నా అధికంగా కాఫీ తాగితే కేన్సర్ సోకే అవకాశం మిగతావారితో పోలిస్తే 30 శాతం తక్కువట. ఇంగ్లండ్ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించగా, వీరి అధ్యయనం ఫలితాలను ‘న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’ ప్రచురించింది. ఇప్పటివరకూ కాఫీలోని కెఫిన్ అనారోగ్యాన్ని కలిగిస్తుందని, అధికంగా కాఫీ తాగడం తప్పని అనుకుంటూనే, ఓ కప్పు కాఫీతో మూడ్ మారిపోతుందని, మరింత ఉత్సాహంగా పనిచేయవచ్చని ఏదో ఒక టైంలో కాఫీని లాగించేస్తుండే వారికి ఈ వార్త మరింత ఉత్సాహాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. ఇకపై ఏమాత్రం మొహమాటం లేకుండా కాఫీని కప్పు మీద కప్పు లాగించేయొచ్చు అంటున్నారు ఈ పరిశోధకులు.

More Telugu News