ap7am logo

వాళ్ల నుంచి తప్పించుకోవడం చాలా కష్టం సుమా!

Thu, Oct 01, 2015, 06:05 PM
సాంకేతి విప్లవం నేరగాళ్లను పట్టుకునేందుకు ఎంతో సాయపడుతోంది. బ్రిటన్ లో నిఘా విభాగం ఎంత పటిష్ఠంగా ఉందో చెప్పేందుకు ఛానెల్ 4 నిర్వహించిన ఓ రియాలిటీ షో ఎంతో ఉపయోగపడింది. ఈ రియాలిటీ షో లో పాల్గొనేందుకు 14 మంది సామాన్యులను ఎంపిక చేశారు. లండన్ టెర్రరిస్టు నిరోధక విభాగం మాజీ అధిపతి, సీఐఏ విశ్లేషకుడు, నిఘా నిపుణులతో కూడిన 30 మంది సభ్యులతో మరో బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందానికి ఆ 14 మంది సామాన్యుల ఫోటోలు ఇచ్చింది. ఆ 14 మందిని దేశంలోని ఎక్కడికైనా పారిపోయి దాక్కోమని చెప్పింది. అలా 28 రోజుల పాటు ఎవరికీ దొరకకుండా దాక్కోగలిగినవారే విజేతగా నిలుస్తారని ప్రకటించింది. వారి దారి ఖర్చులకు డబ్బు కూడా ఇచ్చింది. అయితే, కేవలం రెండు వారాల్లోనే 13 మందిని నిఘా బృందం పట్టేసింది.

కానీ 46 ఏళ్ల జీపీ రీకీ అలెన్ మాత్రం మూడో వారం వరకు నిఘా బృందాన్ని ముప్పుతిప్పలు పెట్టాడు. పలుమార్లు అతని దగ్గరగా వెళ్లిన నిఘా బృందం సభ్యుల కళ్ళు కప్పగలిగాడు. దీంతో 28 రోజుల పాటు తప్పించుకోలేకపోయినప్పటికీ చివరికి అతనినే విజేతగా ప్రకటించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, 'ది 39 స్టెప్స్' అనే అడ్వెంచరస్ నవల తనకు ఎంతో స్ఫూర్తి నిచ్చిందని, తన ఇంట్లో ఉన్న ఆ నవలను వీరెవరైనా చదివి ఉంటే తాను ఎప్పుడో దొరికేసేవాడినని పేర్కొన్నారు. నిఘా నీడన నిజాయతీగా బతకాల్సిందేనని, అలా లేకుంటే పట్టుబడి తీరాల్సిందేనని నిరూపించేందుకు ఈ షోలో పాల్గొన్నానని చెప్పాడు.

కాగా, బ్రిటన్ లో ప్రతి 11 మందికి ఒకటి చొప్పున సీసీ కెమెరాలు వీధుల్లో అమర్చారు. వాటిలో ప్రతి నెంబర్ ప్లేటును ఆటోమేటిక్ గా గుర్తించగలిగే 8వేల కెమెరాలు ఉన్నాయి. ఇవి కోటీ నలభై లక్షల మంది ప్రజలపై నిఘా వేయగలవు. అలాగే మూడున్నర కోట్ల మంది ప్రజల ఫోన్లను ట్రాక్ చేయగల జీపీఎస్ వ్యవస్థ లండన్ నిఘా విభాగాల సొంతం. వాటిని వినియోగించుకునే సౌలభ్యం ప్రైవేట్ టీవీ ఛానెల్ కు ఉండదు కనుక ప్రభుత్వ కెమెరాల వద్ద సొంత కెమెరాలు, మ్యాపింగ్ వ్యవస్థను ఉపయోగించి వారిని పట్టేసినట్టు ఛానెల్ 4 తెలిపింది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
IC - Shoora EB5 Banner Ad
Garudavega Banner Ad
DK Aruna Shocks Telangana Congress Party, Ready to Leave t..
DK Aruna Shocks Telangana Congress Party, Ready to Leave the Party
Bithiri Sathi Busy With Mobile Whole Day..
Bithiri Sathi Busy With Mobile Whole Day
9 PM Telugu News: 19th March 2019..
9 PM Telugu News: 19th March 2019
Mohan Babu Heaps Praise On Comedian Ali At His Birthday Ce..
Mohan Babu Heaps Praise On Comedian Ali At His Birthday Celebrations
Caste Plays Prominent Role in AP 2019 Elections: TDP, YCP,..
Caste Plays Prominent Role in AP 2019 Elections: TDP, YCP, Jana Sena
Cricketers Turn as Politicians ahead of Elections..
Cricketers Turn as Politicians ahead of Elections
YS Vijayamma and YS Sharmila Election Campaign Schedule De..
YS Vijayamma and YS Sharmila Election Campaign Schedule Details
Chandrababu Slams YS Jagan and Asaduddin Owaisi- Big Byte..
Chandrababu Slams YS Jagan and Asaduddin Owaisi- Big Byte
Watch: Akshay Kumar And Parineeti Chopra Spend Time With T..
Watch: Akshay Kumar And Parineeti Chopra Spend Time With The BSF Jawans
Actress Sumalatha Big Shock to Congress Party..
Actress Sumalatha Big Shock to Congress Party
Prof K Nageshwar On Ex-CBI JD Joining Jana Sena..
Prof K Nageshwar On Ex-CBI JD Joining Jana Sena
Devineni Avinash V/s Kodali Nani In Gudivada Election Figh..
Devineni Avinash V/s Kodali Nani In Gudivada Election Fight
Prashant Kishor AP Election internal Survey details - Lea..
Prashant Kishor AP Election internal Survey details - Leaked
Kovvur Ex MLA TV Rama Rao removes Yellow shirt before medi..
Kovvur Ex MLA TV Rama Rao removes Yellow shirt before media
Chitralahari- Parugu Parugu Telugu Lyric Video- Sai Dharam..
Chitralahari- Parugu Parugu Telugu Lyric Video- Sai Dharam Tej
Watch: Niharika Imitates Pawan Kalyan Mannerism@ Suryakant..
Watch: Niharika Imitates Pawan Kalyan [email protected] Suryakantham Movie Promotions
Updates on YS Vivekananda Reddy Case Investigation- Cook, ..
Updates on YS Vivekananda Reddy Case Investigation- Cook, Driver Wife
The Complete Analysis Of Chandrababu's 5 Years Governance..
The Complete Analysis Of Chandrababu's 5 Years Governance
YS Jagan Speech Live- YSRCP Public Meeting- Avanigadda..
YS Jagan Speech Live- YSRCP Public Meeting- Avanigadda
PK is a Notorious dacoit- Chandrababu..
PK is a Notorious dacoit- Chandrababu