: ఆ 'రుధిర చంద్రుడి'ని మనం చూడలేము... కానీ, అత్యంత అద్భుతమే!

ఖగోళంలో జరిగే కంటికి కనిపించే మహాద్భుతాల్లో ఒకటి మరో నాలుగు రోజుల్లో కనువిందు చేయనుంది. అదే 'రుధిర చంద్రుడు' (బ్లడ్ మూన్)... అంటే, మీకు తెలుసుగా భూమికి, చంద్రుడికి మధ్య దూరం తగ్గినప్పుడు చంద్రుడు మరింత పెద్దగా కనిపిస్తాడని. ఈ చంద్రుడిని 'సూపర్ మూన్' అంటారు. సూపర్ మూన్ ఉన్న సమయంలో గ్రహణం వస్తే దాన్నే బ్లడ్ మూన్ గా పిలుస్తారు. గత 33 ఏళ్లలో ఇలా ఎన్నడూ జరగలేదు. మరో 18 ఏళ్లు జరగబోదు. ఈ నెల 28న ఆకాశంలో ఈ అరుదైన చంద్ర గ్రహణం సంభవించనుంది. దీన్ని వీక్షించేందుకు శాస్త్రజ్ఞులు, రీసెర్చర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఉత్తర అమెరికాలోని తూర్పు ప్రాంత ప్రజలు ఈ చంద్రగ్రహణాన్ని పూర్తిగా చూడగలుగుతారు. భారత కాలమానం ప్రకారం ఇది సోమవారం ఉదయం 7:40 గంటలకు ప్రారంభమై గంటా 12 నిమిషాలు కొనసాగి 8:52 వరకూ ఉంటుంది. అంటే మనం బ్లడ్ మూన్ ను చూసే అవకాశాలు లేవన్నమాట. తూర్పు పసిఫిక్ ప్రాంతంలోని కొన్ని చోట్ల ఈ గ్రహణం కనిపిస్తుందని నాసా వెల్లడించింది. ఇదిలావుండగా, ఉత్తరాభాద్ర నక్షత్ర మీనరాశిలో కేతు గ్రహం సంచరిస్తున్న వేళ చంద్రగ్రహణం సంభవిస్తున్నదని పండితులు చెబుతున్నారు. ఈ గ్రహణం కనిపించకపోయినా, మేషం నుంచి మీనం వరకూ అన్ని రాశులపైనా గ్రహణ ప్రభావం ఉంటుందని వివరించారు.

More Telugu News