: నేడు 18వ పడిలోకి అడుగుపెట్టిన గూగుల్...కానీ పుట్టిన రోజు కాదు!

నేడు గూగుల్ 18వ వసంతంలోకి అడుగుపెట్టింది. కానీ నేడు పుట్టిన రోజు మాత్రం కాదు. ఇంకా చెప్పాలంటే, నామకరణం రోజు. తొలిసారి 1995లో లారీపేజ్, సెర్జీ బ్రిన్ లు స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో కలుసుకున్నారు. ఇద్దరి అభిప్రాయాలు, అభిరుచులు కలవడంతో స్నేహం కుదిరి, ఇద్దరూ 1996లో బ్యాక్ రబ్ పేరిట సెర్చ్ ఇంజిన్ ప్రారంభించారు. దీనికి గూగుల్ గా నామకరణం చేస్తూ 1997 సెప్టెంబర్ 15న వెబ్ సైట్ రిజిస్టర్ చేశారు. googol నుంచి గూగుల్ పేరు వచ్చింది. googol అనేది ఓ సంఖ్య పేరు. ఈ సంఖ్యలో 1 తరువాత వంద సున్నాలుంటాయి. దీంతో నేడు గూగుల్ నామకరణ దినోత్సవంగా పేర్కొంటారు.

More Telugu News