: మేకప్ చేసుకుంటున్నారా?...ప్రమాదం అంచున ఉన్నట్టే!

సినిమా నటులను అనుకరించే యువతరం అందంగా కనిపించాలనే తాపత్రయంతో మార్కెట్లో దొరికే క్రీములు, పౌడర్లు, మేకప్ సామగ్రిని విరివిగా వాడేస్తుంటారు. అయితే అవన్నీ ప్రమాదకరమేనని పరిశోధనలు చెబుతున్నాయి. చర్మానికి రంగునిచ్చే ఫెయిర్ నెస్ క్రీముల్లో హైడ్రోక్వినోన్ ను వినియోగిస్తారు. ఇది కేన్సర్ కారకమని వారు వెల్లడించారు. అలాగే పౌడర్లు, ఫౌండేషన్లలో చూర్ణం చేసిన నానో కణాలను కలుపుతారు. అవి శరీరం, రక్తనాళాల్లోకి చొచ్చుకెళ్లి శరీరభాగాలను పాడు చేసి, వేరే కణాలను సృష్టించి డీఎన్ఏ, జీవకణాలను నాశనం చేస్తాయని పరిశోధకులు తెలిపారు. షాంపూలు నిల్వ చేసేందుకు పారాబెంజీన్లను వినియోగిస్తారని, పారాబెంజీన్లు ఎండో క్రెయిన్లను దెబ్బతీసి కేన్సర్ కు కారణమవుతాయని వారు వివరించారు. లిప్ స్టిక్ వల్ల ఎన్నో వ్యాధులు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. వీటన్నింటికీ పరిష్కారంగా కుంకుడు కాయ, షీకాయ, పసుపు, సున్నిపిండి, నిమ్మకాయ వంటి వాటిని వినియోగిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఆధునికత మోజులో శరీరాన్ని, ఆరోగ్యాన్ని పాడుచేసుకోవద్దని వారు చెబుతున్నారు.

More Telugu News