: మరణించాక చంద్రుడిపైకి వెళ్తారా?... బుకింగ్స్ మొదలయ్యాయి మరి!

చనిపోయిన తరువాత స్వర్గానికి వెళ్తామో, నరకానికి వెళ్తామో తెలియదుగానీ, అస్థికలను చంద్రుడిపైకి పంపే వీలును కల్పిస్తామని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఎలీజియం స్పేస్ నిర్వాహకులు చెబుతున్నారు. ఒక్కొక్కరి అస్థికలను చంద్రుడిపైకి తరలించేందుకు రూ. 8 లక్షలు చెల్లించాల్సి వుంటుందని అంటున్నారు. నాసా మాజీ ఇంజనీర్ థామస్ సివీట్ ఎలీజియం స్పేస్ కంపెనీని స్థాపించారు. తమ కస్టమర్ ఒకరు, తన తల్లి అస్థికలను చంద్రుడిపైకి చేర్చాలని కోరడంతో, తమకు ఈ ఆలోచన వచ్చిందని థామస్ తెలిపారు. 2017లో 100 మంది అస్థికలను గ్రిఫిన్ ల్యాండర్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా చంద్రుడిపైకి పంపుతామని చెబుతున్నారు. కాగా, ఇందుకోసం బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమైపోయాయి.

More Telugu News