: సైబర్ బుల్లీయింగ్ అడ్డుకట్టకు ఎన్నారైని ఆశ్రయించిన ఫేస్ బుక్...రూ.1.25 కోట్ల అందజేత

తిట్ల దండకం, సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకోవడం, ఇతరులపై బురదజల్లేలా అబద్ధాలను ప్రచారం చేయడం తదితర వ్యవహారాలతో సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ‘సైబర్ బుల్లీయింగ్’ జోరందుకుంది. ఈ నయా గొడవతో సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు ఫేస్ బుక్, ట్విట్టర్ లు తలలు పట్టుకుంటున్నాయి. దీనిని ఆపడం ఆ సైట్లకు సాధ్యం కావడం లేదు. మరి ఎవరిని ఆశ్రయించాలి? అన్న కోణంలో రోజుల తరబడి సమాలోచనలు సాగించిన ఫేస్ బుక్ నిర్వాహకులకు భారత సంతతికి చెందిన అమెరికన్ సమీర్ హిందూజా కనిపించారు. సైబర్ బుల్లీయింగ్ ను నియంత్రించడంలో సిద్ధహస్తుడిగా పేరుగాంచిన సమీర్ హిందూజాను ఫేస్ బుక్ ప్రతినిధులు సంప్రదించారు. ఈ బెడద నుంచి తమకు ఉపశమనం కల్పించాలని కోరారు. దీనికోసం భారీ మొత్తాన్నే చెల్లిస్తామని చెప్పారు. దీనికి సమీర్ హిందూజా సరేననడంతో ఫేస్ బుక్ ఆయనకు ఏకంగా 1.88 లక్షల డాలర్లు (రూ.1.25 కోట్లు) అందజేసింది. ఫేస్ బుక్ నుంచి భారీ మొత్తాన్ని అందుకున్న సమీర్ హిందూజా వెనువెంటనే రంగంలోకి దిగిపోయారు.

More Telugu News