: ఐటీలో అబ్బాయిల కంటే అమ్మాయిల జీతాలే ఎక్కువ!

సాఫ్ట్ వేర్ రంగంలో అబ్బాయిలదే ఆధిక్యం అయినప్పటికీ ప్రారంభ దశలో అమ్మాయిల జీతాలే అధికంగా ఉన్నట్టు ఓ సర్వే వెల్లడించింది. మూడేళ్లలోపు ఎక్స్ పీరియన్స్ ఉన్న అమ్మాయిలు సగటున 9.8 లక్షల వేతనం తీసుకుంటుండగా, అబ్బాయిలు 9.5 లక్షల సగటు వేతనానికే పరిమితమయ్యారని సర్వే వెల్లడించింది. హైదరాబాదులో అయితే అమ్మాయిలు 9.7 లక్షల రూపాయల వేతనం అందుకొంటుండగా, అబ్బాయిలు 9.4 లక్షల రూపాయలు తీసుకుంటున్నట్టు సర్వే తెలిపింది. అనుభవం పెరిగే కొద్దీ అబ్బాయిల వేతనాల్లో గణనీయమైన మార్పు సంభవించినట్టు సర్వే వివరించింది. నాలుగేళ్ల అనుభవం తరువాత అబ్బాయిలు వెనుదిరిగి చూడడం లేదని, ఏడు నుంచి పదేళ్ల అనుభవం ఉన్న అబ్బాయిలు, అమ్మాయిల కంటే 50 శాతం వేతనం అధికంగా తీసుకుంటున్నట్టు సర్వే వెల్లడించింది. ముంబై, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో కెరీర్ ప్రారంభంలో అమ్మాయిలు, అబ్బాయిల వేతనాల్లో ఎలాంటి వ్యత్యాసం లేదని సర్వే తెలిపింది.

More Telugu News