: ఈ పాప ఆ గ్రామానికే రోల్ మోడల్ !

ఆరోగ్యమే మహాభాగ్యం. దీనిని ఎవ్వరూ కాదనడానికి వీలు లేదు. మానసికంగా, శారీరకంగా మనం ఆరోగ్యంగా ఉంటే, పక్కనున్న వారికి ఉపయోగం ఉంటుంది. మనల్ని చూసి ఒకరిద్దరన్నా తమ ఆహారపు అలవాట్లు మార్చుకుని, అనుసరించడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గౌరా గ్రామాన్ని గుర్తు చేసుకోవాల్సి వుంటుంది. ఎందుకంటే ఆ గ్రామంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య అధికంగా ఉంది. కానీ, అదే గ్రామంలోని ఆరేళ్ల చిన్నారి సానియాకు ఈ విషయంలో మినహాయింపు ఉంది. ఎందుకంటే, తను ఆ గ్రామంలో ఆరోగ్యంగా ఉన్న ఒకే ఒక్క చిన్నారి కనుక! ఫ్రెండ్స్, చుట్టుపక్కల చిన్నారులందరిలోకి పర్ఫెక్టుగా పౌష్టికాహారం తీసుకునేది సానియా మాత్రమే. దీంతో సానియా ఆ గ్రామంలో అందరికీ ఆదర్శమై పోయింది. సానియా పౌష్టికాహార పరంగా ముందు నిలవడానికి కారణం ఆమె తల్లిదండ్రులే. సానియా తండ్రి కుండలు తయారు చేస్తాడు. కుటుంబ నియంత్రణ పాటించాడు. మంచి ఆహారపు అలవాట్లు ఉన్న కుటుంబం కావడంతో ఆరోగ్యవంతమైన సంతానం వారి సొంతమైంది. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ తరపున సర్వే నిర్వహించిన ఓ స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది.

More Telugu News