: ఈ సాయంత్రం నింగికెగరనున్న జీఎస్ఎల్వీ-డీ6... అంతరిక్షంలోకి కీలకమైన జీశాట్-6 ఉపగ్రహం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 'ఇస్రో' మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ఈ సాయంత్రం 4.52 గంటలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ-డీ6 రాకెట్ ను ప్రయోగించనుంది. ఈ రాకెట్ ద్వారా అత్యంత కీలకమైన జీశాట్-6 ఉపగ్రహాన్ని మధ్యంతర భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. బుధవారం మధ్యాహ్నం 11.52 గంటల నుంచి రాకెట్ లాంచింగ్ కు సంబంధించిన కౌంట్ డౌన్ కొనసాగుతోంది. మొత్తం 29 గంటలపాటు ఈ కౌంట్ డౌన్ కొనసాగుతుంది. జీశాట్-6 ఉపగ్రహం కమ్యూనికేషన్ రంగంలో కీలకపాత్ర పోషించనుంది. ఇందులోని ఎస్-బ్యాండ్ ద్వారా సమాచారం రంగంలో ఆధునిక సేవలు అందనున్నాయి. జీశాట్-6 ఉపగ్రహం బరువు 2,117 కేజీలు.

More Telugu News