: డిప్రెషన్ లో ఉన్నారా?...స్మార్ట్ ఫోన్ కి దూరంగా ఉండండి

డిప్రెషన్ లో ఉంటే స్మార్ట్ ఫోన్ కి దూరంగా ఉండమని నిపుణులు సూచిస్తున్నారు. డిప్రెషన్ లో ఉండగా స్మార్ట్ ఫోన్ తో గడపడం అంత మంచిది కాదని వారు అభిప్రాయపడుతున్నారు. అమెరికాలోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ డీన్ ప్రభు డేవిడ్, ఇతర శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం ప్రకారం...డిప్రెషన్ తో బాధపడుతున్నప్పుడు స్మార్ట్ ఫోన్ తో గడపడం అంత శ్రేయస్కరం కాదని, అలా గడపడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుందే తప్ప మెరుగవదని తేలిందని వారు చెబుతున్నారు. డిప్రెషన్ కు గురైనప్పుడు స్మార్ట్ ఫోన్ వంటి సాధనాలను ఆశ్రయించడం కంటే ఇతరులతో మాట్లాడడమే మేలని వారు సూచిస్తున్నారు. తద్వారా పరిస్థితి మెరుగుపడుతుందని వారు స్పష్టం చేశారు.

More Telugu News