: కార్గో షిప్ లో అంతరిక్షానికి చేరిన జపాన్ విస్కీ

అంతర్జాతీయ అంతరిక్షకేంద్రానికి (ఐ.ఎన్.ఎస్) మానవ రహిత కార్గోషిప్ లో జపాన్ విస్కీ చేరింది. ఈ విస్కీ వ్యోమగాములు తాగేందుకు కాదు... అంతరిక్షంలో గరుత్వాకర్షణ శక్తి లేని చోట ఆల్కహాల్ లో జరిగే మార్పులను అధ్యయనం చేసేందుకు దీనిని శాస్త్రవేత్తలు పంపారు. ఈ కార్గో షిప్ ద్వారా వ్యోమగాములకు అవసరమయ్యే నీరు, ఆహారం, దుస్తులు, ఇతర నిత్యావసర వస్తువులను, వాటితో పాటు పరిశోధనకు అవసరమైన జపాన్ కంపెనీకి చెందిన విస్కీని కూడా పంపించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వీటిని అందజేసిన అనంతరం భూమికి ఆ వ్యామనౌక బయల్దేరింది. సెప్టెంబర్ లో ఈ మానవ రహిత కార్గో షిప్ భూమిని చేరనుంది.

More Telugu News