: ఇండియన్ ఫుడ్ కావాలంటే ఢిల్లీ వద్దు... లండన్ బెటర్!

గ్లోబలైజేషన్ కారణంగా భారతీయ వంటకాలకు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ పెరిగిపోయింది. ఇండియన్ ఫుడ్ అంటే వరల్డ్ సెలబ్రిటీలు లొట్టలేసే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ప్రపంచంలోని ప్రముఖ నగరాలన్నింటిలో ఇండియన్ రెస్టారెంట్లు కొలువుదీరాయి. వైవిధ్యభరితమైన రుచులతో వినియోగదారులను ఆకట్టుకుంటూ అంతర్జాతీయ స్థాయిలో భారత్ పేరును చాటుతున్నాయి. పరిస్థితి ఎలా తయారైందంటే భారతదేశ రాజధాని ఢిల్లీలో కంటే లండన్ లోనే పసందైన ఇండియన్ ఫుడ్ దొరుకుతుందట. ఈ మాట అంటున్నది ఎవరో కాదు. ప్రఖ్యాత చెఫ్ వివేక్ సింగ్. లండన్ లో భారత్ కుక్ లు ప్రయోగాత్మక రీతిలో కొత్త కొత్త వంటకాలతో మెనూలు సిద్ధం చేస్తుంటారని వివరించారు. మనకే పెద్దగా తెలియని మన రుచులు కూడా లండన్ లో దొరుకుతాయని అన్నారు. అందుకే లండన్ బెటర్ అని పేర్కొన్నారు. వివేక్ సింగ్ ప్రస్తుతం లండన్ లోని సుప్రసిద్ధ 'ద సినామోన్ క్లబ్', సినామోన్ కిచెన్, సినామోన్ సోహో రెస్టారెంట్లకు ఎగ్జిక్యూటివ్ చెఫ్ గా వ్యవహరిస్తున్నారు. సినామోన్ క్లబ్ లో తాను సర్వ్ చేసే కొన్ని బెస్ట్ డిష్ లు భారత్ లో కనిపించవని ఆయన తెలిపారు.

More Telugu News