: శరీర ఆకృతి బాగాలేదని అనుకునే వారి కోసం యువతి వినూత్న ప్రచారం!

లండన్ లో నిత్యమూ బిజీగా ఉండే 'పికాడిలి సర్కస్' సెంటర్ కు వచ్చింది జే వెస్ట్ అనే పేరున్న యువతి. కళ్లకు గంతలు కట్టుకుంది. ఒంటిపైనున్న పై దుస్తులు తీసేసింది. పక్కనే "ఈటింగ్ దిజార్డర్ , ఆత్మ గౌరవ సమస్యలతో బాధపడుతున్న వారి కోసమే ఇలా నిలబడ్డా. నాలాంటి వారికి మద్దతుగా నిలవాలనుకునే వారు నా శరీరంపై 'లవ్' సింబల్ వేయండి" అని ప్లకార్డును పట్టుకుంది. ఆమె అలా నిలబడి వుండగా, అండగా నిలుస్తామని వచ్చి లవ్ సింబల్ గీసిన వారి వీడియోను తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచింది. ఈ వీడియో ఇప్పుడు ఆన్ లైన్లో హాట్ టాపిక్. వరల్డ్ వైడ్ గా లక్షలాది మంది దీన్ని తిలకించారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 60 శాతం మంది తమ శరీరాకృతిని ఇష్టపడటం లేదని సెంటర్ ఫర్ అప్పియరెన్స్ నిర్వహించిన సర్వేలో వెల్లడైన విషయం తెలిసిందే. శరీర ఆకృతిని గురించి బాధపడే వారికి అండగా నిలిచే నిమిత్తం వినూత్నంగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్ట జే వేస్ట్ చెబుతోంది.

More Telugu News