: అతి ముఖ్యమైన ఆండ్రాయిడ్ అప్ డేట్ పనిచేయట్లేదు!

ప్రపంచ వ్యాప్తంగా ఆండ్రాయిడ్ ఫోన్లను హ్యాకర్ల బారి నుంచి కాపాడాలన్న ఉద్దేశంతో గూగుల్ విడుదల చేసిన అప్ డేట్ ఎంతమాత్రమూ పనిచేయదని నిపుణులు తేల్చేశారు. ఆండ్రాయిడ్ ఫోన్లకు ఒక చిన్న మెసేజ్ ని పంపడం ద్వారా సమస్యను పరిష్కరిస్తామని గూగుల్ చెబుతూ దీన్ని విడుదల చేయగా, ఆ తరువాత కూడా హ్యాకింగ్ సులువుగానే సంభవమని టెక్ పండితులు తెలిపారు. కాగా, ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్ వేర్ అప్ డేట్ ఇదేనని గూగుల్ చెబుతోంది. కోట్లాది సంఖ్యలో మొబైల్ ఫోన్ల ఆపరేటింగ్ సిస్టమ్ ను మార్చడం ద్వారా కస్టమర్ల సమాచారాన్ని మరింత భద్రంగా ఉంచుతామని చెబుతోంది. అయితే, ఆండ్రాయిడ్ వ్యవస్థ పూర్తి సెక్యూరిటీతో సమాచారాన్ని భద్రంగా ఉంచుతుందని భావించలేమని ఐటీ వర్గాలు చెబుతున్నాయి.

More Telugu News