: పిల్ల కాదు పిడుగు...ఆ వేగానికి ఎవరైనా చిత్తవ్వాల్సిందే!

ఎనిమిదేళ్ల ఆ చిన్నారిని చూసి అంతా ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. ఆమె 'పంచ్' పవర్ కి నోరెళ్లబెడుతున్నారు. రష్యాలోని ఒరొనెజ్ ప్రాంతానికి చెందిన ఎనిమిదేళ్ల ఎవ్నికా సాద్వ్ కాస్ ను చిచ్చిరపిడుగు అనే చెప్పాలి. చిన్నప్పటి నుంచీ బాక్సింగును ఒక ఆటలా ప్రాక్టీస్ చేస్తోంది. బాక్సింగ్ దిగ్గజాలే ఆశ్చర్యపోయే నైపుణ్యం ఈ చిన్నారిలో కనిపిస్తోంది. నిమిషానికి 100 పంచ్ లు ఇవ్వగల వేగం ఎవ్నికా సొంతం. ఒంటి చేత్తో 30 సెకెన్లలో 47 పంచ్ లు ఇవ్వగలదు. ఇంత వేగంగా పంచ్ లు కొట్టే బాక్సర్ ప్రపంచంలో ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. ఎవ్నికా ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో బాలిక టాలెంట్ కి అంతా ఆశ్చర్యపోతున్నారు. నాలుగేళ్ల వయసులో ఉన్నప్పుడు ఎవ్నికా టాలెంట్ ను గుర్తించిన ఆమె తండ్రి రుస్త్రం ఆమెకు శిక్షణ ఇప్పిస్తున్నారు. ఎంతసేపు ప్రాక్టీస్ చేసినా తాను అలసిపోదని బాలిక తండ్రి గర్వంగా చెబుతున్నాడు. బాలిక వేగానికి ఎవరైనా చిత్తవ్వాల్సిందే అంటాడాయన. ఆమెతో పాటుగా తన ఆరుగురు పిల్లలకూ ఆయన శిక్షణ ఇప్పిస్తున్నాడు. వీరంతా కలసి చేసే ప్రాక్టీస్ చూసితీరాల్సిందే. ఎవ్నికా వీడియో చూసిన వారు 'పిల్ల కాదు పిడుగు' అంటున్నారు.

More Telugu News