: డ్రోన్లు ఇలా కూడా ఉపయోగించవచ్చట!

ఇప్పటికే నిఘా అవసరాల కోసం డ్రోన్లు వినియోగిస్తుండడం తెలిసిందే. వినియోగదారులకు వస్తువులు, ఆహార పదార్థాలను ఈ మానవ రహిత విమానాల ద్వారా అందించేందుకు ప్రయోగాలు జరుగుతున్నాయి. తాజాగా, డ్రోన్ల సాయంతో రక్త నమూనాల రవాణాపై ఓ అధ్యయనం నిర్వహించారు. సాధారణ పరీక్షల కోసం రక్త నమూనాలు సేకరించాక 40 నిమిషాల వరకు ఈ రక్తం పరీక్షలకు అనువుగానే ఉంటుందని తెలుసుకున్నారు. ఆ విధంగా డ్రోన్ల ద్వారా రవాణా చేసిన రక్త నమూనాలతో సవ్యరీతిలోనే ఫలితాలు వస్తాయని గుర్తించిన పరిశోధకులకు ఆ విషయం ఉత్సాహాన్నిచ్చింది. రవాణా సౌకర్యాలు లేని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో రోగుల బ్లడ్ శాంపిల్స్ ను డ్రోన్ల ద్వారా సమీప ల్యాబ్ లకు తరలించవచ్చని, ఆ రవాణాకు తక్కువ సమయం పడుతుందని, రక్తం కూడా తాజాగానే ఉంటుందని ఈ అధ్యయనం ద్వారా రూఢీ పరుచుకున్నారు. గ్రామాల్లో డ్రోన్ల వినియోగం ద్వారా ఆరోగ్య కార్యకర్తలు త్వరితగతిన రోగుల రక్త పరీక్షల ఫలితాలు తెలుసుకునే వీలుంటుందని, తద్వారా, రోగ నిర్ధారణ చేసి తగిన చికిత్స చేయడం సాధ్యమవుతుందని పరిశోధకులంటున్నారు.

More Telugu News