: చెట్టు ఒకటే... పళ్లు మాత్రం 40 రకాలు!

ఒకే చెట్టుకి జామ, దానిమ్మ, మామిడి వంటి వివిధ జాతులకు చెందిన పళ్లు కాస్తే ఎలా ఉంటుంది? అద్భుతం కదూ...ప్రతి ఇంట్లో ఓ చెట్టు నాటుకుని సీజన్ కు తగ్గట్టు పళ్లు తినవచ్చు. కానీ ఇది సాధ్యమేనా? ఇలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్న సిరాకస్ యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ వాన్. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాన్ పరిశోధనలతో సరికొత్త చెట్టును రూపొందించారు. అంటుకట్టడం ద్వారా రూపొందిన ఈ చెట్టు 40 రకాల పండ్లను కాస్తుంది. సీజన్ కి తగ్గట్టు ఇది కాపుకు వస్తుందని ఆయన చెప్పారు. అయితే ఈ చెట్టు కాస్త ఖరీదైనదని, ఇలాంటి చెట్టు కావాలంటే తయారు చేసి ఇస్తానని, దీనికి 30 వేల డాలర్లు వెచ్చించాలని ఆయన చెప్పారు. ఇది ఏడాది నుంచి పదేళ్లలోపు కాపుకు వస్తుందని ఆయన తెలిపారు.

More Telugu News