: యూట్యూబ్ లో ఇకపై త్రీడీ వీడియోలు కూడా వీక్షించవచ్చట

యూట్యూబ్ లో త్వరలో కొత్త సదుపాయం అందుబాటులో రానుంది. సాధారణ వీడియోలు కాకుండా త్రీడి, 360 డిగ్రీల కోణంలో వర్చువల్ దృశ్యాలను కూడా వీక్షించే సౌకర్యం రాబోతోందని యూట్యూబ్ సీఈవో సుసాన్ వోజ్ సికి ప్రకటించారు. కాలిఫోర్నియాలో ఈరోజు జరిగిన ఆరో వార్షి విడ్కాన్ ఈవెంట్ లో ఈ విషయాన్ని తెలిపారు. ఇప్పటికే త్రీడి ప్రకటనలను యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తున్నామన్నారు. త్వరలో అన్ని త్రీడీ, 360 వీడియోలను, దృశ్యాలను ఎవరికి వారు అప్ లోడ్ చేసుకునేలా ఆధునీకరించిన యాప్ ను విడుదల చేస్తున్నట్టు చెప్పారు. కంప్యూటర్ స్క్రీన్లపై మౌస్ ను కదిలిస్తే కావాల్సిన యాంగిల్స్ లో వీడియో దృశ్యాలను కదిలించే అవకాశం యాప్ ద్వారా ఉంటుందని సీఈవో వివరించారు. సెల్ ఫోన్ లో అయితే ఫోన్ ను కదిలించడం ద్వారా యాంగిల్స్ ను మార్చుకోవచ్చన్నారు. ఆండ్రాయిడ్, మొబైల్ వెర్షన్లలో ఈ కొత్త యాప్ ను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చని చెప్పారు.

More Telugu News