: లిఫ్ట్ అడిగే రోబో ప్రయాణం ప్రారంభించింది!

లిఫ్ట్ అడిగి ప్రయాణించే రోబో ప్రయాణం ప్రారంభించింది. అమెరికాలోని మసాచుసెట్స్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు ఈ రోబో బయల్దేరింది. రోబో తనంత తానుగా కదలలేదు కనుక లిఫ్ట్ అడుగుతూ ప్రయాణిస్తుంది. రోబో ప్రయాణం చేయడమే వింత, అలాంటిది కేవలం లిఫ్ట్ అడుగుతూ మసాచుసెట్స్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో చేరుకోవడం విశేషమే. అయితే, ఈ రోబో అలాంటిలాంటిది కాదని దీని రూపకర్తలు చెబుతున్నారు. చిన్న పిల్లాడి సైజులో ఉండే ఈ రోబో పేరు 'హిచ్ బాట్'. ఇది కదలలేదు కనుక చేతిని పైకి లేపి బొటనవేలు చూపిస్తుంది. డిజిటల్ ముఖంలో ఇది నవ్వే నవ్వు చూసి ఎవరైనా లిఫ్ట్ ఇస్తారని రూపకర్తలు చెబుతున్నారు. ఈ రోబో గతంలో యూరోప్, కెనడాల్లో ప్రయాణించి ఎందరినో ఆకట్టుకుందని వారు వెల్లడించారు. ప్రయాణించిన ప్రాంతాన్ని ప్రతి 20 నిమిషాలకు ఓ సారి ఫోటోలు తీసుకుంటుంది. దీనితో సెల్ఫీలు, ఫోటోలు తీసుకునేందుకు ఎంతో మంది ఆసక్తి చూపడం విశేషం. 'హిచ్ బాట్' రోబోకు ఫేస్ బుక్, ట్విటర్, ఇన్ స్టా గ్రాంలో 30 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

More Telugu News