: డ్రోన్ల ద్వారా హైస్పీడ్ ఇంటర్నెట్ కు ఫేస్ బుక్ కసరత్తు

ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ హైస్పీడ్ ఇంటర్నెట్ కోసం కసరత్తులు చేస్తోంది. నెక్స్ట్ జనరేషన్ ఇంటర్నెట్ కోసం సరికొత్త లేజర్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్న ఫేస్ బుక్ కనెక్టివిటీ ల్యాబ్, ఆ సాంకేతికతను ఉపయోగించుకుని డ్రోన్లు, శాటిలైట్ల ద్వారా కమ్యూనికేషన్ వ్యవస్థలకు అధికవేగంతో కూడిన ఇంటర్నెట్ అందించనుంది. ఈ లేజర్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సాయంతో సమాచారాన్ని కంటికి కనిపించని కిరణాల రూపంలో ప్రసారం చేస్తారు. తద్వారా అధిక వేగం సాధ్యమవుతుందని ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు, సీఈఓ మార్క్ జుకెర్ బర్గ్ అంటున్నారు. "మా ఇంటర్నెట్.ఆర్గ్ ప్రయత్నాల్లో భాగంగా డ్రోన్లు, శాటిలైట్ల సాయంతో హైస్పీడ్ ఇంటర్నెట్ కు కృషి చేస్తున్నాం. వైర్ లెస్ నెట్ వర్కులకు అందని దూరంలో నివసిస్తున్న కోట్లాది ప్రజల కోసం చేపట్టిన కార్యక్రమాల్లో ఇది ఒకటి. ఈ టెక్నాలజీలో ఉపయోగించే కిరణాలను కంటితో చూడలేము" అని వివరించారు.

More Telugu News