: దేశంలో మరో 12 నగరాలకు గూగుల్ ట్రాఫిక్ ఇన్ఫో

భారతదేశంలోని మరో 12 నగరాలకు ఈ రోజు నుంచి గూగుల్ రియల్ టైమ్ ట్రాఫిక్ ఇన్ఫో అందుబాటులోకి వస్తోంది. కోల్ కత, కోయంబత్తూర్, లక్నో, సూరత్, తిరువనంతపురం, ఇండోర్, లూథియానా, విశాఖపట్నం, నాగపూర్, కోచి, మధురై వంటి 12 నగరాల్లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే గూగుల్ దేశంలోని అన్ని జాతీయ రహదారులపై ఈ రియల్ టైమ్ ట్రాఫిక్ సమాచారం తెలిపే సదుపాయాన్ని అందిస్తోంది. తాజాగా 12 నగరాలతో కలిపి దేశంలో మొత్తం 34 నగరాల్లో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. యాప్, డెస్క్ టాప్ లలో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని సంస్థ అధికారులు తెలిపారు. ట్రాఫిక్ సిగ్నల్స్ మాదిరిగానే అందులో మూడు రంగులతో ఉండే విధానం రోడ్డుపై ఉన్న ట్రాఫిక్ ను తెలియజేస్తుంది. ఎరుపు రంగులో ఉంటే ట్రాఫిక్ చాలా ఎక్కువగా, ఆరెంజ్ రంగులో ఉంటే ఒక మోతాదులో ఉన్నట్టు సూచిస్తుంది.

More Telugu News